ఇందల్వాయి చంద్రాయన్‌పల్లిలో రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి
నిజామాబాద్ జిల్లా:
ఇందల్వాయి మండలం చంద్రాయన్‌పల్లి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందారు. ఈ ఘటనలో దుమాల సుజాత అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి
పోలీసుల వివరాల ప్రకారం.. కామారెడ్డి నుంచి బడా భీంగల్ వైపు మోటార్‌సైకిల్‌పై దుమాల లింబాద్రి, ఆయన భార్య దుమాల సుజాత ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో లారీ సుజాతపైకి వెళ్లడంతో ఆమె సంఘటన స్థలంలోనే మృతి చెందినట్లు ఇందల్వాయి ఎస్‌ఐ సుమలత తెలిపారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సుమలత వెల్లడించారు.












