ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ.. డీఏలు, పీఆర్సీ, మెట్రో అంశాలపై చర్చ
తెలంగాణ కేబినెట్ సమావేశం ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో జరగనుంది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ భేటీలో ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన అంశాలతో పాటు హైదరాబాద్ మెట్రోకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది.
ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రెండు డీఏలపై కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే పీఆర్సీ నివేదికతో పాటు ఉద్యోగుల పెండింగ్ డిమాండ్లపైనా చర్చ జరిగే అవకాశం ఉంది.
పెండింగ్ బిల్లుల చెల్లింపులు, ఉద్యోగుల ఇతర సమస్యలను కూడా కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు హైదరాబాద్ మెట్రో ఫేజ్-1 స్వాధీనం, ఫేజ్-2 విస్తరణకు సంబంధించిన అంశాలు కూడా కేబినెట్ అజెండాలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.