తెలంగాణలో పాత పెన్షన్ కోసం ఉద్యోగుల చలో హైదరాబాద్ | ఎల్బీ స్టేడియంలో పెన్షన్ మీటింగ్

పెన్షన్ మీటింగ్ | చలో హైదరాబాద్
ఉద్యోగ ఉపాధ్యాయుల ఉద్యమం
పెన్షన్ మీటింగ్

చలో హైదరాబాద్

టీ ఎస్ సీ పీ ఎస్ ఈ యు ఆధ్వర్యంలో ఉద్యోగ ఉపాధ్యాయులంతా హైదరాబాద్‌లో భారీ కార్యక్రమానికి తరలివెళ్లారు

తాజా సమాచారం
పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఉద్యోగుల డిమాండ్ | ఎల్బీ స్టేడియంలో భారీ సమావేశం | దాదాపు రెండు లక్షల మంది ఉద్యోగులు రావచ్చని అంచనా
2.60 లక్షలు
రాష్ట్రంలోని సీపీఎస్ ఉద్యోగుల సంఖ్య
₹1 లక్ష
ఉదాహరణగా పేర్కొన్న నెల జీతం
2 లక్షలు
సమావేశానికి రావచ్చని అంచనా

పెన్షన్ విధానంపై ఉద్యోగుల డిమాండ్

టీ ఎస్ సీ పీ ఎస్ ఈ యు ఆధ్వర్యంలో ఉద్యోగ ఉపాధ్యాయులంతా చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రాష్ట్రం మొత్తంలో సిపిఎస్ ఉద్యోగుల సంఖ్య రెండు లక్షల 60 వేలు గా ఉంది.

2004 తర్వాత ఎంపికైన ఉద్యోగులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా లక్ష రూపాయలు జీతం తీసుకున్న ఉద్యోగికి నాలుగు లేదా ఐదు వేలు పెన్షన్ రావడం జరుగుతుంది.

అదే పాత పెన్షన్ అయితే 50% పెన్షన్ వస్తుంది. కావున హైదరాబాద్ ఎల్బీ స్టేడియం లో జరిగే మీటింగ్ కి భారీ సంఖ్యలో దాదాపు రెండు లక్షల ఉద్యోగులు రావచ్చని అంచనా.

ఉద్యోగుల ప్రధాన డిమాండ్
పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు.

ప్రస్తుత ప్రజా ప్రభుత్వం ఎన్నికల హామీలు పాత పెన్షన్ అమలు చేస్తామని చెప్పడం జరిగింది.

కాంగ్రెస్ పాలిత ప్రాంతాలు అయినా రాజస్థాన్, చతిస్గడ్, జార్ఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ లలో ఎన్నికల హామీలు కనుగుణంగా పాత పెన్షన్ పునరుద్ధరించడం జరిగింది.

కావున తెలంగాణ రాష్ట్రంలో కూడా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఉద్యోగులు భారీ సంఖ్యలో తరలి వెళ్లారు.

కార్యక్రమంలో పాల్గొన్న వారు

తరలిన వారిలో సంఘం అధ్యక్షుడు నాగం నాగరాజు, ప్రధాన కార్యదర్శి మెగావత్ కని రామ్, జిల్లా ఉపాధ్యక్షుడు గులాం షాకీర్, అనిల్, వేణు, శ్రీనివాస్, సంగీయ, శ్రీధర్ జోషి, గాంధీ, వేణు, రాందాస్, రాజేష్, నాగభూషణం, నరేష్, విట్టల్, రాజశేఖర్, నీశాంత్, లక్ష్మన, సంజయ్, నౌశ్య, శ్రీనివాస్, అనిల్, శ్రీనివాస్, రామ్ కుమార్, నవీన్ కుమార్, పండిత్, దుర్గయ్య, బాపురావు, దేవి సింగ్, సురేష్, పి ఆర్ టి యు మండల అధ్యక్షులు కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగుల డిమాండ్ ఒక్కటే… పాత పెన్షన్ విధానం అమలు చేయాలి

చలో హైదరాబాద్ కార్యక్రమంలో భారీగా పాల్గొన్న ఉద్యోగ ఉపాధ్యాయులు

Leave a Reply