తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరిక Yellow Alert for 8 Telangana Districts.. Weather Department Warns of Rain
హైదరాబాద్, ఆగస్టు 27: తెలంగాణలో వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గురువారం రాష్ట్రంలోని 8 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తాజా వాతావరణ సూచనల్లో పేర్కొన్నారు. Hyderabad, August 27: As rains continue across Telangana, the weather department has issued a Yellow Alert for several districts. The latest weather forecast indicates the possibility of rainfall in eight districts of the state on Thursday.
ఎల్లో అలర్ట్ పరిధిలో భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జనగామ, ఖమ్మం, మహబూబాబాద్, మంచిర్యాల, సూర్యాపేట, వరంగల్ జిల్లాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో వర్షాలతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు అధికారులు సూచించారు. The districts under the Yellow Alert are Bhadradri Kothagudem, Hanamkonda, Jangaon, Khammam, Mahabubabad, Mancherial, Suryapet and Warangal. Officials have indicated that these areas may experience rain along with strong winds.
కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. Light to moderate rainfall is expected in some areas, while some other areas may receive heavy rainfall. People have been advised to remain alert considering the prevailing weather conditions.