గణేష్ మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన తోటకూర వజ్రెష్ యాదవ్
వినాయక చవితి సందర్భంగా మల్కాజ్‌గిరి కార్పొరేషన్ ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని ఘట్కేసర్, ఎదులాబాద్ డివిజన్లు, ఘనపూర్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్ సందర్శించారు.
వినాయక చవితి తొలి రోజు పూజా కార్యక్రమాల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా తోటకూర వజ్రెష్ యాదవ్ మాట్లాడుతూ గణేశుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఎల్లవేళలా ఆనందంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ప్రతి కుటుంబం సంతోషంగా, సుభిక్షంగా ఉండాలని గణనాథుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.
గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.