
ఎల్లారెడ్డి, అక్టోబర్ 6, (పవార్ వార్త):
ఎల్లారెడ్డి మండలంలోని ఐకేపీ–పీపీసీ కొనుగోలు కేంద్రాల కమిటీ సభ్యులు, బుక్ కీపర్లు, సెంటర్ ఇన్‌చార్జ్‌లకు పీపీసీ కేంద్రాల నిర్వహణ, బుక్ కీపింగ్, మౌలిక వసతుల నిర్వహణపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ సీఆర్‌పీలు పుష్ప, భాగ్య, పూర్తి పాల్గొని పీపీసీ కేంద్రాల నిర్వహణకు సంబంధించిన పలు అంశాలపై సిబ్బందికి మెళకువలను వివరించారు. కొనుగోలు కేంద్రాల్లో రికార్డుల నిర్వహణ, బుక్ కీపింగ్ విధానం, రైతులకు అవసరమైన సౌకర్యాలు, కేంద్రాల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఏపీఎం రామనారాయణ గౌడ్ మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వారికి ప్రయోజనం చేకూరే విధంగా పీపీసీ కొనుగోలు కేంద్రాలను నిర్వహించాలని సూచించారు. అధికారులు, సిబ్బంది కేంద్రాలను సందర్శించే సమయంలో రైతులకు సంబంధించిన వివరాలు అందుబాటులో ఉండేలా రికార్డులను సక్రమంగా నిర్వహించాలని తెలిపారు.
రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఏపీఎం సూచించారు. రైతులకు పారదర్శకంగా సేవలు అందిస్తూ, కొనుగోలు కేంద్రాల నిర్వహణలో నిబంధనలు పాటించాలని సిబ్బందికి సూచించారు.
కార్యక్రమంలో పీపీసీ కేంద్రాల కమిటీ సభ్యులు, బుక్ కీపర్లు, సెంటర్ ఇన్‌చార్జ్‌లు తదితరులు పాల్గొన్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

