పవార్ వార్త, ఎల్లారెడ్డి: ఉమ్రా యాత్రకు బయలుదేరుతున్న పర్వేజ్ ఉల్ రెహమాన్‌ను ఎల్లారెడ్డి మైనారిటీ వెల్ఫేర్ కమిటీ సభ్యులు సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. మక్కా, మదీనా పవిత్ర యాత్రకు వెళ్తున్న ఆయనకు కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

సన్మాన సభలో కమిటీ సభ్యులు మాట్లాడుతూ, పర్వేజ్ ఉల్ రెహమాన్ యాత్రను సంతోషంగా, సురక్షితంగా పూర్తి చేసుకుని తిరిగి రావాలని ఆకాంక్షించారు. అల్లాహ్ ఆయన ఉమ్రాను స్వీకరించాలని, సంపూర్ణ ఆరోగ్యం, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు షేక్ గయాజుద్దీన్, ఉపాధ్యక్షులు సయ్యద్ మీర్, ముక్రమ్ అలీ, ప్రధాన కార్యదర్శి అజీజుర్ రెహమాన్, జాయింట్ సెక్రటరీలు అహ్మద్ పాషా, అహ్మద్, సభ్యులు మక్సుద్ అలీ, సాదిక్ అలీ తదితరులు పాల్గొన్నారు.

0 మంది ఇష్టపడ్డారు
షేర్
డౌన్‌లోడ్న్యూస్ పేపర్ క్లిప్పింగ్ • హై క్వాలిటీ

మరిన్ని వార్తలు

వ్యాఖ్యానించండి