పవార్ వార్తా సూత్ర
🚨 బ్రేకింగ్ న్యూస్ | జవహర్‌నగర్ డంపింగ్ యార్డు

జవహర్‌నగర్ డంపింగ్ యార్డును శాశ్వతంగా మూసివేయాలి..!

శాస్త్రీయ పద్ధతిలో యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మాజీ ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి
📍 జవహర్‌నగర్:

ప్రజల ఆరోగ్య భద్రత, పర్యావరణ పరిరక్షణ, జీవించే హక్కును కాపాడేందుకు
జవహర్‌నగర్‌లోని రాంకీ చెత్త డంపింగ్ యార్డును శాస్త్రీయ పద్ధతిలో
యుద్ధప్రాతిపదికన శాశ్వతంగా మూసివేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
తగిన చర్యలు చేపట్టాలని మాజీ మేయర్ దొంతగాని శాంతి కొటేష్ గౌడ్,
మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.

2026 ఆగస్టు 14న ప్రగతినగర్‌లోని నీలం రాంచంద్రయ్య భవనంలో
జవహర్‌నగర్ డంపింగ్ యార్డు ఎత్తివేత పోరాట కమిటీ చైర్మన్ షేక్ షావలి,
కన్వీనర్ ఉమామహేష్ అధ్యక్షతన మాజీ ప్రజాప్రతినిధుల సమావేశం జరిగింది.

డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రత్యామ్నాయ ప్రాంతాలను
గుర్తించి, జవహర్‌నగర్ నుంచి డంపింగ్ యార్డును దశలవారీగా తొలగించే
ప్రక్రియను ప్రారంభించాలని మాజీ ప్రజాప్రతినిధులు కోరారు.

పర్యావరణం, ప్రజారోగ్యంపై ఆందోళన

డంపింగ్ యార్డు కారణంగా గత రెండు దశాబ్దాలకు పైగా పరిసర ప్రాంతాల్లో
పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడుతోందని సమావేశంలో నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజల ఆరోగ్యం, భూమి, నీటి వనరులపై ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుని
సమగ్ర చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ప్రభావిత ప్రాంతాల్లో ఉచిత మంచినీటి సరఫరా, వైద్య సదుపాయాలు కల్పించడంతో పాటు
కాలుష్య ప్రభావానికి గురైన భూమి, నీటిని శుద్ధి చేసేందుకు అవసరమైన నిధులను
రాంకీ సంస్థ నుంచి ప్రభుత్వం రాబట్టాలని వారు డిమాండ్ చేశారు.

అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని విజ్ఞప్తి

డంపింగ్ యార్డు సమస్యపై గతంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్,
మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, స్థానిక డీసీసీ కాంగ్రెస్ అధ్యక్షుడు
తోటకూర వజ్రేష్ యాదవ్ సమక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన
సందర్భాన్ని మాజీ ప్రజాప్రతినిధులు గుర్తుచేశారు.

డంపింగ్ యార్డు ఎత్తివేత కోసం ఈటల రాజేందర్ నాయకత్వంలో అఖిలపక్షాన్ని
ఏర్పాటు చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ, మరోసారి విస్తృత స్థాయిలో
అఖిలపక్ష సమావేశాన్ని అధికారికంగా నిర్వహించాలని వారు కోరారు.
ప్రజాభిప్రాయాలను సేకరించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి
తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు.

ప్రభావిత చెరువులు, కుంటలకు రక్షణ కల్పించాలి

డంపింగ్ ప్రభావంతో ప్రమాదకర పరిస్థితులకు చేరుకున్న చెరువులు, కుంటల
సంరక్షణకు తగిన చర్యలు చేపట్టాలని సమావేశంలో తీర్మానించారు.
ప్రభావిత ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి అవసరమైన నిధులను
రాంకీ సంస్థ నుంచి రాబట్టాలని డిమాండ్ చేశారు.

డంపింగ్ యార్డు ప్రభావిత ప్రాంతాల్లో చోటుచేసుకున్న మరణాలపై సమగ్ర
అధ్యయనం చేసి, కారణాలను శాస్త్రీయంగా నిర్ధారించాలని, బాధిత కుటుంబాలకు
చట్టబద్ధంగా అందాల్సిన సహాయం, పరిహారం విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు
చేపట్టాలని వారు కోరారు.

ఆగస్టు 24 తర్వాత డివిజన్ల వారీగా కమిటీలు

ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం తమ పోరాటాన్ని కొనసాగిస్తామని
మాజీ ప్రజాప్రతినిధులు తెలిపారు. ఆగస్టు 23, 24 తేదీల్లో జరిగే
మహంకాళి అమ్మవారి బోనాల జాతర అనంతరం డివిజన్ల వారీగా కమిటీలను ఏర్పాటు చేసి,
జవహర్‌నగర్ డంపింగ్ యార్డు ఎత్తివేత పోరాట కమిటీకి అండగా నిలుస్తామని
వారు ప్రకటించారు.

“ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, జీవించే హక్కును కాపాడేందుకు
డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం సాధించే వరకు ప్రజాక్షేత్రంలోనే
ఉంటాం.”

మాజీ ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల ప్రతినిధుల పాల్గొనడం

ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్లు మేక లలిత యాదవ్, గొడుగు వేణు,
ఏ. సుబ్రహ్మణ్యం, ఎం. రాజ్ కుమార్, జమాల్‌పూర్ నవీన్, ఎం. వెంకటేష్,
జి. సాయికుమార్, పల్లపు రవి, ఎస్. మహేందర్ రెడ్డి, డి. సతీష్,
పి. బాబు, గండి రాంచందర్, కుతాడి శ్రీకాంత్, బి. సతీష్ గౌడ్,
బల్లి శ్రీనివాస్, అల్లూరి సంగీత రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

అలాగే ఐఎఫ్‌టీయూ, కమిటీ కోశాధికారి శివబాబు, గౌరవ సలహాదారులు,
మాజీ ఉపసర్పంచ్ నర్సింహ గౌడ్, బీఆర్ఎస్‌కు చెందిన ఆలూరి రాజశేఖర్,
సీపీఎం శివన్నారాయణ, టీయూసీఐ వి. ప్రవీణ్, పీఓడబ్ల్యూ (విముక్తి)
గడిపే సునీత, సీఎంఎస్ జయ, మాజీ ఎంపీటీసీ ప్రజాప్రతినిధి
ఏ. విజయరాయ్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

🔖 వార్త ట్యాగ్స్

జవహర్‌నగర్
డంపింగ్ యార్డు
రాంకీ డంపింగ్ యార్డు
డంపింగ్ యార్డు ఎత్తివేత
పర్యావరణ పరిరక్షణ
ప్రజారోగ్యం
కీసర
మేడ్చల్ మల్కాజిగిరి
జవహర్‌నగర్ వార్తలు
దొంతగాని శాంతి కొటేష్ గౌడ్
రెడ్డిశెట్టి శ్రీనివాస్
షేక్ షావలి
ఉమామహేష్
తెలంగాణ వార్తలు
హైదరాబాద్ వార్తలు
పవార్ వార్తా సూత్ర

🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply