ఆసరా పెన్షన్లు: అర్హులైన ప్రతి ఒక్కరికి మంజూరు చేయాలి.. సీపీఎం డిమాండ్
గార్ల: ఆసరా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకొని గత కొన్ని సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న లబ్ధిదారుల పేర్లు ఫీల్డ్ సర్వే మొబైల్ యాప్‌లో రాకపోవడంపై సీపీఎం ఆందోళన వ్యక్తం చేసింది. అర్హులైన ప్రతి ఒక్కరికి ఆసరా పెన్షన్లు మంజూరు చేయాలని, లిస్టులో పేరు ఉండి యాప్‌లో పేరు రాని వారి సమస్యలను పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందునూరి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
ఎన్నో ఆశలతో ఆసరా పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి, క్షేత్రస్థాయిలో ఫీల్డ్ సర్వేకు వస్తున్న అధికారులు మొబైల్ యాప్‌లో కొంతమందికి పేరు రాలేదని చెబుతుండటంతో పెన్షన్‌కు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఆయన అన్నారు.
ఎప్పుడో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల పేర్లు పంచాయతీ కార్యదర్శుల జాబితాలో ఉన్నప్పటికీ, మొబైల్ యాప్‌లో పేరు రాకపోవడంతో అర్హులైన పేదలు పెన్షన్ కోల్పోయే ప్రమాదం ఉందని కందునూరి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు.
దరఖాస్తుదారులు అధికారులను అడిగితే లిస్టులో పేరు ఉందని, కానీ ఆధార్ నంబర్ నమోదు చేసినప్పటికీ మొబైల్ యాప్‌లో వివరాలు రావడం లేదని అధికారులు చెబుతున్నారని ఆయన తెలిపారు. వెరిఫికేషన్‌కు తుది గడువు దగ్గర పడుతుండటంతో దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారని, లిస్టులో ఉన్న పేర్లు మొబైల్ యాప్‌లో వచ్చే విధంగా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.