గార్లలో జ్ఞానేష్‌ కుమార్‌ను తొలగించాలని సీపీఎం నిరసన

గార్ల నెహ్రూ సెంటర్‌లో చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ జ్ఞానేష్‌ కుమార్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఆ పార్టీ నాయకులు కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకుని, చేతుల్లో నల్లజెండాలు పట్టుకుని ఆందోళన తెలిపారు.

ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కందునూరి శ్రీనివాస్‌, మండల కార్యదర్శి అలవాల సత్యవతి మాట్లాడుతూ.. జ్ఞానేష్‌ కుమార్‌ తీసుకుంటున్న నిర్ణయాలు పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారుతున్నాయని ఆరోపించారు.

మిగిలిన ఇద్దరు ఎన్నికల కమిషనర్ల సూచనలను పట్టించుకోకుండా SIR పేరుతో దాదాపు 13 కోట్ల ఓట్లను తొలగించారని వారు ఆరోపించారు.

అధికార పక్షం ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్నా ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదని, విపక్షాల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవడం లేదని సీపీఎం నాయకులు విమర్శించారు.

ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించాల్సిన రాజ్యాంగ సంస్థ అయినప్పటికీ అధికార పక్షానికి అనుకూలంగా పనిచేస్తోందని వారు ఆరోపించారు.

జ్ఞానేష్‌ కుమార్‌ను తొలగిస్తే తప్ప ప్రజాస్వామ్యం మనుగడ సాగించలేదని వారు పేర్కొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి

🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply