గార్లలో మళ్లీ బొడ్డెమ్మ వేడుకలు.. రాతి స్తంభం బజార్‌లో ఘనంగా ప్రారంభం
గార్ల: మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని రాతి స్తంభం బజార్‌లో, విశ్వశాంతి స్కూల్ సమీపంలో బొడ్డెమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 1న మహిళలు ఉత్సాహంగా పాల్గొని సంప్రదాయబద్ధంగా బొడ్డెమ్మ వేడుకలను నిర్వహించారు.
ఎన్నో సంవత్సరాలుగా మరుగునపడిన ఈ సంప్రదాయాన్ని మళ్లీ ప్రజల్లోకి తీసుకురావడం విశేషంగా నిలిచింది. బతుకమ్మ పండుగకు ముందు నిర్వహించే బొడ్డెమ్మ వేడుకల్లో మహిళలు ఆటపాటలతో సందడి చేశారు.
బొడ్డెమ్మను పూలతో అలంకరించి సంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ సంస్కృతి, ఆచారాలను గుర్తు చేసుకున్నారు.
బొడ్డెమ్మ వేడుకలు గ్రామీణ మహిళల ఐక్యతకు, ప్రకృతితో అనుబంధానికి, తరతరాలుగా కొనసాగుతున్న తెలంగాణ సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తాయని నిర్వాహకులు పేర్కొన్నారు. పాత సంప్రదాయాలను తిరిగి నిర్వహించడం ద్వారా భవిష్యత్ తరాలకు తెలంగాణ సంస్కృతి, పండుగల విశిష్టతను పరిచయం చేయవచ్చని తెలిపారు.
గార్లలో బొడ్డెమ్మ వేడుకలు మళ్లీ ప్రారంభం కావడంతో స్థానికంగా సంతోషం వ్యక్తమైంది. గార్ల గ్రామ ప్రజలకు బొడ్డెమ్మ వేడుకల సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.