చెంగిచర్లలో గణనాథుని లడ్డూ వేలం: రూ.1,40,000కు దక్కించుకున్న లావణ్య-బాలకృష్ణ దంపతులు

మేడిపల్లి: మేడ్చల్ జిల్లా చెంగిచర్ల డివిజన్ పరిధిలోని కమలానగర్ కాలనీలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణంలో ముగిశాయి. గణపతి నిమజ్జనోత్సవం సందర్భంగా కాలనీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వామివారి విశేష లడ్డూ ప్రసాదం వేలం పాట ఉత్సాహభరితంగా సాగింది.

కాలనీవాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ వేలం పాటలో తీవ్ర పోటీ నడుమ, కమలానగర్ కాలనీకి చెందిన కనుగుల లావణ్య – బాలకృష్ణ దంపతులు రూ.1,40,000 (లక్షా నలభై వేల రూపాయలు) ఇచ్చి గణనాథుని దివ్య లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్నారు.

ఈ సందర్భంగా లడ్డూను దక్కించుకున్న లావణ్య – బాలకృష్ణ దంపతులను ఉత్సవ కమిటీ సభ్యులు, కాలనీవాసులు ఘనంగా శాలువాతో సత్కరించి, దేవుని శేషవస్త్రాలు, ప్రసాదాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని కైవసం చేసుకోవడం తమ పూర్వజన్మ సుకృతమని, విఘ్నేశ్వరుని ఆశీస్సులతో తమ కుటుంబంతో పాటు కాలనీ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని దంపతులు ఆకాంక్షించారు.

ఈ వేలం పాట, నిమజ్జన కార్యక్రమంలో కమలానగర్ కాలనీ అధ్యక్షుడు కె. మురళీ కృష్ణ, కార్యదర్శి సుభాష్, కోశాధికారి కె. బాలకృష్ణలతో పాటు కమిటీ ప్రతినిధులు, ప్రముఖులు జమ్మయ్య, బాల్‌రాజ్ గౌడ్, భాస్కర్, సతీష్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్, ఇతర కాలనీ పెద్దలు, భక్తులు, మహిళలు, యువకులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.

అనంతరం గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మంగళ హారతులు ఇచ్చి కోలాహలంగా నిమజ్జన ఊరేగింపును ప్రారంభించారు.

ఈ వార్తను షేర్ చేయండి

🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply