అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలంటూ హమార ప్రసాద్‌పై ఎల్లారెడ్డి పోలీసులకు ఫిర్యాదు
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ హమార ప్రసాద్ అలియాస్ నాగులపురం వరప్రసాద్‌పై ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మండల అంబేడ్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఈ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్‌ను కించపరిచేలా, రాజ్యాంగాన్ని అవమానించేలా హమార ప్రసాద్ వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదుదారులు ఆరోపించారు.
చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్
అంబేడ్కర్‌ను ఉద్దేశించి “అంబేడ్కర్ కల్పిత నాయకుడు” అని, రాజ్యాంగ రచన అంబేడ్కర్ చేయలేదని హమార ప్రసాద్ పేర్కొన్నారని ఫిర్యాదులో ఆరోపించారు.
అంబేడ్కర్ ఇప్పుడు జీవించి ఉంటే గాంధీని గాడ్సే కాల్చి చంపినట్లుగా తాను అంబేడ్కర్‌ను కాల్చి చంపేవాడినని ఆయన వ్యాఖ్యానించినట్లు ఫిర్యాదుదారులు పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలు భారత రాజ్యాంగ నిర్మాతను అవమానించడంతో పాటు ప్రజల మధ్య కులం, మతం, జాతుల విషయంలో విభేదాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉందని ఫిర్యాదుదారులు ఆరోపించారు.
హమార ప్రసాద్‌పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, అంబేడ్కర్‌పై ఆయన రాసిన పుస్తకం ప్రచురణ, ఆవిష్కరణ జరగకుండా పుస్తకాన్ని రద్దు చేయాలని పోలీసులను కోరినట్లు తెలిపారు.
ఫిర్యాదులో పేర్కొన్న వారు
ఈ కార్యక్రమంలో జిల్లా వైస్ ప్రెసిడెంట్ అట్కరి బబ్లు, డివిజన్ అధ్యక్షుడు మల్లు సాయిబాబా, ఉపాధ్యక్షుడు డాక్టర్ సాయిలు, కోశాధికారి రోడ్డ సాయిబాబా, మండల్ అధ్యక్షులు అమృతరావు, ప్రధాన కార్యదర్శి కుసుల కంటి సాయిలు, ఉపాధ్యక్షుడు బి. గౌతమ్, చిరంజీవులు, ఏల్లు బాబు, సతీష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తను షేర్ చేయండి:
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.