వెల్లుట్ల పేటలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు.. జలసిరులపై గ్రామసభ
వెల్లుట్ల పేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం గ్రామ అభివృద్ధి, నీటి సంరక్షణ అంశాలపై ఉపాధి హామీ జలసిరుల గ్రామసభ నిర్వహించారు.
సర్పంచ్ కొయ్యల వినోద రాజా గౌడ్ అధ్యక్షతన జరిగిన గ్రామసభలో VBG RAM (Viksit Bharat–Gram …) కార్యక్రమంలో భాగంగా జలసిరులకు సంబంధించిన అంశాలపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు.
విలేజ్ మ్యాప్, విలేజ్ రిసోర్స్ మ్యాప్‌ల ద్వారా గ్రామంలోని చెరువులు, కుంటలు, కాలువలు, ఇతర నీటి వనరులు, సాగుభూములకు సంబంధించిన ప్రాంతాలను ప్రజలకు వివరించారు. వర్షపు నీటిని సంరక్షించడం, భూగర్భ జలాలను పెంపొందించడం, గ్రామంలోని నీటి వనరులను అభివృద్ధి చేయడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామంలో చేపట్టే జలసంరక్షణ పనులు, వాటి ద్వారా స్థానిక కూలీలకు లభించే ఉపాధి అవకాశాలపై గ్రామసభలో చర్చించారు. గ్రామ అవసరాలకు అనుగుణంగా పనులను గుర్తించి ప్రణాళిక రూపొందించే విధానాన్ని కూడా వివరించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు తమ ప్రాంతాల్లో అవసరమైన పనులపై అభిప్రాయాలను వెల్లడించారు.
కార్యక్రమంలో ఉపసర్పంచ్ రాజు యాదవ్, ఉపాధి హామీ APO వినోద్ గౌడ్, TA నరేష్, ఇరిగేషన్ AE వినోద్, ఫీల్డ్ అసిస్టెంట్ బొల్లు భూమయ్య, గ్రామ కార్యదర్శి ప్రసాద్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా గ్రామ అభివృద్ధి, పరిశుభ్రత, నీటి సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.