ఎల్లారెడ్డి మున్సిపల్‌లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
ఎల్లారెడ్డి: మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఎల్లారెడ్డి మున్సిపల్‌లో గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పద్మ శ్రీకాంత్ మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ సత్యం, అహింస, శాంతి, సేవ అనే మార్గాలను ప్రపంచానికి చూపించిన మహానీయుడని అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం గాంధీజీ చేసిన పోరాటం, పేదల పట్ల ఆయన చూపిన ప్రేమ, సత్యం పట్ల ఆయన నిబద్ధత ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
గాంధీజీ ఆశయాలను ఆచరణలో పెట్టి, స్వచ్ఛమైన సమాజం మరియు బలమైన భారతదేశం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జె. జగ్జీవన్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ మత్తమాల ప్రశాంత్ గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.