అంబేద్కర్ విగ్రహాన్ని అదే చౌరస్తాలో కొనసాగించాలి: ఎమ్మెల్యేను కోరిన సంఘం
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి అంబేద్కర్ సంఘం ప్రతినిధులు నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావును కలిసి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం, అంబేద్కర్ భవన్ ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై విజ్ఞప్తి చేశారు.
రోడ్డు విస్తరణ సందర్భంగా ఎల్లారెడ్డిలోని అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. విగ్రహాన్ని అదే చౌరస్తాలో కొనసాగిస్తూ మరింత అభివృద్ధి చేయాలని కోరారు.
ఈ అంశంపై ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు స్పందించి కాంట్రాక్టర్‌తో మాట్లాడి సమస్యను పరిష్కరించినట్లు అంబేద్కర్ సంఘం ప్రతినిధులు తెలిపారు.
అదేవిధంగా ఎల్లారెడ్డిలో అంబేద్కర్ భవన్ మంజూరు చేయాలని సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యేను కోరారు. ఈ విజ్ఞప్తికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు.
తమకు సమయం కేటాయించి సమస్యలను విని స్పందించినందుకు ఎమ్మెల్యేకు అంబేద్కర్ సంఘం ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మ్యాథరి అమృతరావు, బిట్ల సురేందర్, అట్కారి బబ్లు, మేగవత్ కనీరామ్, గుంటిగారి జ్ఞానేశ్వర్, డాక్టర్ సాయిలు, రోడ్డ సాయిబాబా, బేగరి గౌతమ్, ఎర్రోళ్ల చిరంజీవి, కుశలకంటి సాయిలు, ఎర్రోళ్ల ఎల్లుబాబు, కర్రల మొగులయ్య, కురుమ సాయిబాబా, 12వ వార్డు కౌన్సిలర్ ఎరుకల దశరథం, 4వ వార్డు కౌన్సిలర్ హాట్కరి చంద్రయ్య, నీరుడి సతీష్, రామగల శివానందం, బయ్యాని సాయిలు, పురం రవీందర్, చూడ సంజీవులు, దండుగుల లింగమయ్య, సాయిరాం, నడిమిదొడ్డి ముత్యం, బూర్ల వెంకట్, జైపాల్, బేగరి సాయిబాబా, పోతురాజు వెంకటరమణ, బేగరి రవికుమార్, గుడ్డేల విజయరావు, బుజ్జిగారి రాజు, దారా సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.