బిబిపేటలో భక్తిశ్రద్ధలతో వినాయకుడికి ప్రత్యేక పూజలు

వినాయక చవితి సందర్భంగా బిబిపేట మండలంలో భక్తిశ్రద్ధలు వెల్లివిరిశాయి. వివిధ మండపాల వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని వినాయకుడిని ప్రార్థిస్తున్నారు.

ఈ సందర్భంగా తాజా మాజీ ఎంపీటీసీ కొరివి నీరజ భర్త వినాయకుడిని భక్తిశ్రద్ధలతో పూజించారు. గ్రామ ప్రజలంతా పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖశాంతులతో జీవించాలని వినాయకుడిని వేడుకున్నారు.

బిబిపేట మండలంలోని వివిధ వినాయక మండపాల వద్ద యూత్ సభ్యులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం వినాయకుడిని తొలి పూజగా భావిస్తూ భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు.

మండల ప్రజలందరూ ఐక్యంగా, సుఖశాంతులతో జీవించాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని, బిబిపేట మండల సరిహద్దుల నుంచి మండలంలోని ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

ముదిరాజ్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రత్యేక పూజలు

కామారెడ్డి జిల్లా ముదిరాజ్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొరివి నర్సింహులు కూడా వినాయకుడిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

హిందూ సంప్రదాయాలను గౌరవిస్తూ ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించాలని ఆయన కోరారు. మండలంలోని ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని వినాయకుడిని ప్రార్థించినట్లు తెలిపారు.

ఈ వార్తను షేర్ చేయండి

🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply