బిచ్కుంద సిర్ సముందర్‌లో అనారోగ్యంతో కోలుకున్న వారిని పరామర్శించిన హన్మంత్ షిండే
బిచ్కుంద మండలం సిర్ సముందర్ గ్రామంలో అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుని ఇంటికి తిరిగి వచ్చిన మడిగేలా హన్మాండ్లును జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
అనారోగ్యంతో చికిత్స పొంది ఇంటికి తిరిగి వచ్చిన గుల హన్మ భోయి, సాయబోయిని కూడా హన్మంత్ షిండే పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.
రాజా గౌడ్ కుటుంబానికి పరామర్శ
గ్రామానికి చెందిన BRS కార్యకర్త రాజా గౌడ్ మాతృమూర్తి ఇటీవల మరణించిన విషయం తెలుసుకున్న హన్మంత్ షిండే, రాజా గౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వినోద్, ఉప సర్పంచ్ రాజు, BRS మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.