బీబీపేటలో రహదారి విస్తరణకు చర్యలు తీసుకోవాలి: కొరివి నర్సింలు

బీబీపేట మండల కేంద్రంలో పెరుగుతున్న ట్రాఫిక్‌, రహదారుల అధ్వాన పరిస్థితుల నేపథ్యంలో రహదారి విస్తరణకు చర్యలు తీసుకోవాలని తాజా మాజీ ఎంపీటీసీ కొరివి నీరజ భర్త కొరివి నర్సింలు ముదిరాజ్‌ కోరారు. డాబా బంగ్లా నుంచి హెచ్‌పీ పెట్రోల్‌ బంక్‌ వరకు రహదారిని విస్తరించి ఫోర్‌లేన్‌గా అభివృద్ధి చేయాలని డిమాండ్‌ చేశారు.

అక్టోబర్‌ 1న ఉదయం 11.30 గంటలకు బీబీపేట మండల కేంద్రంలో ప్రజలను కలిసి వారి సమస్యలను నర్సింలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రహదారి పరిస్థితిని పరిశీలించారు.

రహదారిపై కంకర రాళ్లు ఉండటంతో పాటు వాహనాలు పక్కకు వెళ్లేందుకు సరైన స్థలం లేకపోవడంతో ప్రమాదాల ముప్పు ఉందని ఆయన పేర్కొన్నారు. రహదారి విస్తరణతో పాటు ఫోర్‌లేన్‌ మధ్యలో డివైడర్‌ ఏర్పాటు చేసి, అందులో విద్యుత్‌ లైటింగ్‌ ఏర్పాటు చేయాలని సూచించారు.

అలాగే రహదారిపై ఉన్న బ్రిడ్జిని పరిశీలించి అవసరమైన మరమ్మతులు చేపట్టాలని నర్సింలు కోరారు. రహదారి విస్తరణ, డివైడర్‌, లైటింగ్‌ ఏర్పాటుతో ట్రాఫిక్‌ సమస్యలు, ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందని ఆయన అన్నారు.

బీబీపేట మండల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి అవసరమైన నిధులు మంజూరు చేయాలని నర్సింలు డిమాండ్‌ చేశారు. బీబీపేటకు వచ్చే ప్రజలు, వాహనదారులు రహదారి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే రాబోయే ఎన్నికల సమయంలో ప్రజల తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని నర్సింలు హెచ్చరించారు.

ఈ వార్తను షేర్ చేయండి

🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply