బిచ్కుంద: విద్యుత్ సరఫరా సక్రమంగా లేక పంటలు ఎండిపోతున్నాయని ఆరోపిస్తూ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని శాంతాపూర్, సీతారాంపల్లి, మాణేపూర్, రాజాపూర్ గ్రామాలకు చెందిన రైతులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. శాంతాపూర్–రాష్ట్ర రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు.

వ్యవసాయ బోర్లపై ఆధారపడి పంటలు సాగు చేస్తున్న రైతులకు విద్యుత్ సరఫరా నిర్దిష్ట సమయాల్లో అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు సక్రమంగా అందక పంటలకు అవసరమైన సమయంలో నీరు అందించలేక పంటలు ఎండిపోతున్నాయని రైతులు తెలిపారు.

అలాగే విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయాలు ఏర్పడటంతో బోర్లు, మోటార్లు కూడా తరచూ మరమ్మతులకు గురవుతున్నాయని గ్రామస్తులు పేర్కొన్నారు. దీంతో తమపై అదనపు ఆర్థిక భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

వ్యవసాయానికి అవసరమైన సమయంలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడంతో పాటు సరఫరా వేళలను క్రమబద్ధీకరించాలని రైతులు డిమాండ్ చేశారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి విద్యుత్ సమస్యను పరిష్కరించి పంటలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply