దూడల ఆరోగ్య పరిరక్షణకు నట్టల నివారణ కార్యక్రమం
బొల్లారం నుంచి మెల్లకుంట తండా వరకు.. దూడలకు నట్టల నివారణ
ఇవి కూడా చదవండి
పవార్ వార్త: నాగిరెడ్దిపేట్ మండలంలో నాలుగు గ్రామాల్లో 81 దూడలకు నట్టల నివారణ మందులు అందించారు. పశువైద్య శాఖ ఆధ్వర్యంలో బొల్లారం, పల్లెబొగడ తండా, జాప్తి జాంకంపల్లి, మెల్లకుంట తండాల్లో దూడల నట్టల నివారణ కార్యక్రమం నిర్వహించినట్లు పశువైద్యుడు డాక్టర్ రవి కుమార్ నాయక్ తెలిపారు.
గ్రామాల వారీగా దూడలకు మందుల పంపిణీ
ఈ కార్యక్రమంలో గ్రామాల వారీగా దూడలకు నట్టల నివారణ మందులు తాగించారు.
– బొల్లారం: 22 దూడలు
– పల్లెబొగడ తండా: 18 దూడలు
– జాప్తి జాంకంపల్లి: 16 దూడలు
– మెల్లకుంట తండా: 25 దూడలు
మొత్తం 81 దూడలకు నట్టల నివారణ మందులు అందించారు. 10 రోజుల నుంచి 6 నెలల వయస్సు ఉన్న దూడలకు ఈ మందులు తాగించినట్లు డాక్టర్ రవి కుమార్ వెల్లడించారు.
ఈకార్యక్రమంలో బొల్లారం సర్పంచ్ ప్రభు గౌడ్, జాప్తి జాంకంపల్లి సర్పంచ్ వర్షిణి పరమేష్, ఉప సర్పంచ్ మిడ్డె బాలరాజ్, పల్లెబొగడ తండా సర్పంచ్ బల్యా నాయక్, మెల్లకుంట తండా సర్పంచ్ బల్యా నాయక్ పాల్గొన్నారు.
పశువైద్యుడు డాక్టర్ రవి కుమార్తో పాటు విజయ, గౌస్, జయరాజ్, గంగారం, పాడి రైతులు కార్యక్రమంలో పాల్గొన్నారు.


















