ప్రజావాక్యం ప్రతినిధి
చిన్నక్రాంతి కాలనీలో శ్రీశైలం యాదవ్ ఆధ్వర్యంలో మహా అన్నదానం
మేడిపల్లి, సెప్టెంబర్ 21
మేడ్చల్ జిల్లా చెంగిచర్ల డివిజన్ చిన్నక్రాంతి కాలనీలో చిన్నక్రాంతి కాలనీ హౌస్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి మండపం ఆవరణలో ప్రముఖ నాయకులు శ్రీశైలం యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమం అత్యంత వైభవంగా, ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కాలనీ ప్రముఖులు విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. వారు శ్రీశైలం యాదవ్‌తో కలిసి కాలనీ ప్రెసిడెంట్ మేడ బాపురాజు అధ్యక్షతన, కమిటీ సభ్యుల పర్యవేక్షణలో అన్నదాన కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. స్వామివారి దర్శనం అనంతరం భక్తులకు స్వయంగా అన్నప్రసాదాలను వడ్డించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కాలనీ వాసులంతా ఐక్యతతో గణేష్ నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయడం, అలాగే భక్తుల కోసం శ్రీశైలం యాదవ్ ఆధ్వర్యంలో ఇటువంటి బృహత్తర మహా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. భక్తిశ్రద్ధలతో పాటు సామాజిక దృక్పథంతో ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమని, స్వామివారి కృపాకటాక్షాలు కాలనీ ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కాలనీ కమిటీ ప్రతినిధులు, మహిళలు, యువకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి, కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అన్నదాన కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన నిర్వాహకులకు, సహకరించిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.