మేడిపల్లిలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు.. మొక్కలు, పండ్ల పంపిణీ

మేడిపల్లి డివిజన్‌లో మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి బోడుప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శైలజ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.

కార్యక్రమంలో భాగంగా మేడిపల్లి వీరాంజనేయ ఆలయం వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి, అనంతరం పర్వతాపురంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి నాయకులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.

300 మొక్కల పంపిణీ

గాంధీ జయంతి సందర్భంగా స్థానికులకు సుమారు 300 పండ్ల మొక్కలు, పూల మొక్కలను పంపిణీ చేశారు.

అనంతరం అమ్మఒడి అనాథాశ్రమంలో సుమారు 50 మంది పిల్లలకు పండ్లను పంపిణీ చేశారు.

గాంధీ ఆశయాలపై నాయకుల ప్రస్తావన

ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ స్వాతంత్ర్య ఉద్యమంలో మహాత్మా గాంధీ పాత్ర కీలకమని పేర్కొన్నారు. శాంతి, అహింస మార్గాల్లో ఆయన సాగించిన ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ, గాంధీ ఆశయాలను కొనసాగిస్తూ దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు.

మొక్కలు, పండ్ల పంపిణీతో గాంధీ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించిన తుంగతుర్తి రవిని డిప్యూటీ కమిషనర్ శైలజ, డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ తదితరులు అభినందించారు.

నాయకులకు తుంగతుర్తి రవి కృతజ్ఞతలు

కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయడంలో సహకరించిన డిప్యూటీ కమిషనర్ శైలజ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కమిటీ సభ్యులకు తుంగతుర్తి రవి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో డీసీసీ జనరల్ సెక్రెటరీ జలంధర్ రెడ్డి, బుచ్చి యాదవ్, డీసీసీ సెక్రెటరీ బండారి రవీందర్, మాజీ మేయర్ అమర్ సింగ్, మాజీ డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్, పీర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బండి శ్రీరాములు, వివిధ డివిజన్ల కాంగ్రెస్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, కంటెస్టెడ్ కార్పొరేటర్లు, మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ, బీసీ సెల్, ఎస్సీ సెల్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply