ప్రజావాక్యం ప్రతినిధి
బోడుప్పల్ సత్తిరెడ్డి కాలనీలో గణపతి నవరాత్రి ఉత్సవాలు: మహా అన్నదానం
మేడిపల్లి, సెప్టెంబర్ 21
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలోని సత్తిరెడ్డి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా కాలనీలో నెలకొల్పిన శ్రీ గణేష్ మండప ఆవరణలో సోమవారం మహా అన్నదాన కార్యక్రమాన్ని కన్నులపండువగా నిర్వహించారు.
అసోసియేషన్ అధ్యక్షుడు ముత్యం రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఉత్సవ కమిటీ ప్రతినిధులు రామచందర్ యాదవ్ మరియు కమిటీ సభ్యులు పర్యవేక్షకులుగా వ్యవహరించారు. ముందుగా గణనాథునికి ప్రత్యేక పూజలు, హారతి సమర్పించిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
కాలనీవాసులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులకు స్వయంగా వడ్డించి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అసోసియేషన్ సభ్యులు, యూత్ కమిటీ ప్రతినిధులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఈ సందర్భంగా అధ్యక్షుడు ముత్యం రెడ్డి మాట్లాడుతూ, గణేష్ ఉత్సవాల సందర్భంగా ప్రతి ఏటా కాలనీవాసులందరి సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. స్వామివారి ఆశీస్సులతో కాలనీ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నామని ఆయన అన్నారు.
రామచందర్ యాదవ్ మాట్లాడుతూ, ఉత్సవాల విజయవంతానికి శ్రమిస్తున్న కమిటీ సభ్యులకు, సహకరించిన కాలనీ పెద్దలకు, యువతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ముఖ్య నాయకులు, మహిళలు, యువకులు, కాలనీ పెద్దలు మరియు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.