కీసర, అక్టోబర్ 8: అన్ని కులాల్లోని అట్టడుగు నిరుపేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు, రిజర్వేషన్లు అందేలా ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలని ‘ఆర్థిక ఆధారిత రిజర్వేషన్ల సాధన కమిటీ’ నాయకులు డిమాండ్ చేశారు. కులమతాలకు అతీతంగా ఆర్థిక ఆధారిత రిజర్వేషన్ల సాధన కోసం ఉద్యమం కొనసాగిస్తామని తెలిపారు.

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర స్థాయి కమిటీ ప్రతినిధులు, వివిధ కుల సంఘాల నాయకులు మాట్లాడారు. రాష్ట్ర కోఆర్డినేటర్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రాజ్యాంగ కమిషన్ ఏర్పాటు చేసి, చట్టబద్ధంగా ఆర్థిక ఆధారిత రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అట్టడుగున ఉన్న ప్రతి పేదవారికి సంక్షేమ ఫలాలు అందే వరకు తమ పోరాటం కొనసాగుతుందని అన్నారు.

24న తెలంగాణలోకి రథయాత్ర

ప్రవీణ్ అరోరా నేతృత్వంలో ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద ప్రారంభమైన 20,000 కిలోమీటర్ల ‘ఆర్థిక రిజర్వేషన్ సాధన రథయాత్ర’ ఈ నెల 24న నాగ్‌పూర్ మీదుగా ఆదిలాబాద్ వద్ద తెలంగాణలోకి ప్రవేశించనుందని రాష్ట్ర కోఆర్డినేటర్ ఏనుగు సంతోష్ రెడ్డి తెలిపారు.

తెలంగాణలో భాగంగా 24న నిర్మల్‌లో కార్నర్ మీటింగ్, కామారెడ్డిలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం నిజామాబాద్‌లో కార్నర్ మీటింగ్, రామాయణపేట, తూప్రాన్ ప్రాంతాల్లో కార్నర్ మీటింగ్‌లు నిర్వహించి రథయాత్ర హైదరాబాద్ చేరుకుంటుందని వివరించారు.

25న హైదరాబాద్‌లోని అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన అనంతరం 26న జనగామ, వరంగల్ మీదుగా పరకాలకు చేరుకుని భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ సభకు సుమారు 15 వేల మంది హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు నాయకులు తెలిపారు.

రథయాత్రకు, ఆర్థిక ఆధారిత రిజర్వేషన్ల ఉద్యమానికి ప్రజలు, అన్ని వర్గాల నాయకులు పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వాలని కమిటీ నాయకులు కోరారు.

ఈ సమావేశంలో పైళ్ల హరినాథ్ రెడ్డి, ఏనుగు సంతోష్ రెడ్డి, నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి, బుట్టం గారి మాధవ రెడ్డితో పాటు పలు కుల సంఘాల ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Sai Tarun yaswanth
Sai Tarun yaswanth పవార్ వార్త • సైట్ అడ్మిన్ ఈ రచయిత ప్రచురించిన ఇతర వార్తలను చూడండి.

Leave a Reply