పెద్దకొడప్‌గల్, అక్టోబర్ 8: పెద్దకొడప్‌గల్ మండల కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద తరచూ జరుగుతున్న విద్యుత్ కోతలను నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మండల బీజేపీ అధ్యక్షుడు మల్లయల సుభాష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కామారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు నీలం చిన్నరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నీలం చిన్నరాజు మాట్లాడుతూ.. మండలంలో తరచూ విద్యుత్ కోతలు విధించడంతో ప్రజలు, రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. విద్యుత్ కోతలను వెంటనే నివారించి నిరంతర విద్యుత్ సరఫరా అందించాలని డిమాండ్ చేశారు.
అనంతరం బీజేపీ నాయకులు విద్యుత్ శాఖ అధికారులకు వినతిపత్రం అందజేశారు. దీనిపై పెద్దకొడప్‌గల్ విద్యుత్ శాఖ ఏఈ సాయినాథ్ గౌడ్ స్పందిస్తూ.. సమస్యను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ధర్నాలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.


