ఎల్లారెడ్డిలో బీజేపీ వర్క్‌షాప్.. సేవా సంకల్ప అభియాన్‌పై సమావేశం
ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహించనున్న సేవా కార్యక్రమాలపై ఎల్లారెడ్డిలో బీజేపీ వర్క్‌షాప్ సమావేశం నిర్వహించారు. ఎల్లారెడ్డి బీజేపీ పట్టణ అధ్యక్షుడు రాజేష్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఆదేశాల మేరకు ‘సేవా సంకల్ప అభియాన్’ పేరుతో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు.
ఈ సందర్భంగా రాష్ట్ర నాయకుడు బాలకిషన్, జిల్లా ఉపాధ్యక్షుడు దేవేందర్ మాట్లాడుతూ.. మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితంలో ప్రజలకు చేసిన సేవలు, పథకాలను ప్రతి పౌరుడికి, ప్రతి ఇంటికి తెలిసేలా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రతి బూత్‌లో కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి శ్రీను, కార్యదర్శి బి. శివ, సీనియర్ నాయకులు బాలరాజు, మల్లయ్య, యువ నాయకుడు జె. శివతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.