తాతా మధు వ్యాఖ్యలపై ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ నిరసన.. బర్తరఫ్ చేయాలని డిమాండ్
శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌పై బీఆర్‌ఎస్ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కురుమ సాయిబాబా ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద ఈ కార్యక్రమం చేపట్టారు.
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌పై ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలు, అసభ్యకరమైన పదజాలం ఉపయోగించారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో తాతా మధును వెంటనే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని, అసెంబ్లీ సాక్షిగా శాసనసభాపతికి క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదేశాల మేరకు ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ దళిత నాయకులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, మండల పార్టీ అధ్యక్షులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, గ్రామ అధ్యక్షులు, NSUI నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, యువకులు, పార్టీ కార్యకర్తలు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డిలో నిర్వహించిన నిరసన కార్యక్రమానికి సంబంధించిన వీడియో.