ఎల్లారెడ్డిలో సెంటర్ డివైడర్ లైటింగ్ పనుల పరిశీలన
ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న సెంటర్ డివైడర్ లైటింగ్ పనులను మున్సిపల్ ఛైర్మన్ శ్రీ పద్మ శ్రీకాంత్ పరిశీలించారు. లైటింగ్ పనులను నాణ్యతతో, వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.
గణేష్ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన
గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని పురస్కరించుకుని నిమజ్జన స్థలాన్ని మున్సిపల్ ఛైర్మన్ శ్రీ పద్మ శ్రీకాంత్, మున్సిపల్ కమిషనర్ శ్రీ జె. జగ్జీవన్ పరిశీలించారు.
నిమజ్జన కార్యక్రమం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం, విద్యుత్ దీపాలు, తాగునీరు, భద్రతా చర్యలు తదితర ఏర్పాట్లను ముందస్తుగా చేపట్టాలని అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు పాల్గొని నిమజ్జన ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు.
ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో అవసరమైన ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్, వార్డు కౌన్సిలర్లు సిద్ది శ్రీధర్, గఫార్, చంద్రయ్య, తిరుపతితో పాటు పప్పు వెంకటేశం పాల్గొన్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.