యెల్లారెడ్డిలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ

యెల్లారెడ్డి: మున్సిపాలిటీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదేశాల మేరకు, మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్, 6వ వార్డు కౌన్సిలర్ సయ్యద్ గఫార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా లబ్ధిదారుల ఇళ్ల వద్ద ముగ్గులు వేసి, వారికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో PACS మాజీ వైస్ చైర్మన్ ప్రశాంత్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ జీవన్, కౌన్సిలర్ చంద్రయ్య, కో-ఆప్షన్ సభ్యుడు పప్పు వెంకటేశం, కాంగ్రెస్ నాయకులు శివానంద్, ఎర్రోళ్ల ఎల్లు బాబు, కాశీరాం తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన పేద కుటుంబాలకు సొంతింటి కల నెరవేరడం సంతోషకరమని పేర్కొన్నారు. లబ్ధిదారులు ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

0 మంది ఇష్టపడ్డారు
షేర్
డౌన్‌లోడ్న్యూస్ పేపర్ క్లిప్పింగ్ • A4 • హై క్వాలిటీ
A4 కథనం
ఒరిజినల్ ఫోటో

మరిన్ని వార్తలు

Leave a Reply