యూరియా కోసం రైతు ఫోన్.. ఏఓపై అసభ్య పదజాలంతో దూషించారన్న ఆరోపణలు
కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో యూరియా కోసం రాత్రి వేళ ఫోన్ చేసిన ఓ రైతును మండల వ్యవసాయ అధికారి (ఏఓ) రాజలింగం అసభ్య పదజాలంతో దూషించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాత్రి సమయంలో ఫోన్ చేయడం తప్పు అంటూ ఏఓ మాట్లాడినట్లు పేర్కొంటున్న ఆడియో రికార్డింగ్ ప్రస్తుతం గ్రామంలోని వాట్సాప్ గ్రూపుల్లో వైరల్‌గా ప్రచారం అవుతోంది.
యూరియా అవసరం నేపథ్యంలో రైతు రాత్రి సమయంలో ఏఓ రాజలింగానికి ఫోన్ చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా రాత్రివేళ ఫోన్ చేయడంపై ఏఓ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు, అనంతరం అసభ్య పదజాలం ఉపయోగించినట్లు రైతు ఆరోపిస్తున్నాడు.
ఈ ఫోన్ సంభాషణను రైతు రికార్డు చేసినట్లు చెబుతున్నారు. ఆ రికార్డింగ్ ప్రస్తుతం వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతోంది.
అయితే, ఆడియోలోని సంభాషణకు సంబంధించిన పూర్తి నేపథ్యం, ఇరుపక్షాల వాదనలు, అలాగే నిజంగా తప్పు ఎవరిది అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ వ్యవహారంపై అధికారులు పరిశీలన చేపట్టి వాస్తవాలను నిర్ధారించే పనిలో ఉన్నట్లు సమాచారం.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.