నాగోల్ బండ్లగూడలో రౌడీషీటర్ మహమ్మద్ నహీమ్ హత్య.. నిందితుల కోసం పోలీసుల గాలింపు
హైదరాబాద్ నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ ఆనంద్‌నగర్ చౌరస్తా సమీపంలో రౌడీషీటర్ మహమ్మద్ నహీమ్ దారుణ హత్యకు గురయ్యాడు. పాత కక్షలు, సెటిల్మెంట్లకు సంబంధించిన డబ్బుల విషయంలో గత మూడు నెలలుగా నహీమ్, ఉమామహేశ్వర్ అలియాస్ జేకే మహేష్ మధ్య వివాదం కొనసాగినట్లు సమాచారం.
ఖమ్మం జిల్లా ఇల్లెందుకు చెందిన మహమ్మద్ నహీమ్ బండ్లగూడ సహభావన అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్నట్లు సమాచారం. ఇల్లెందు పట్టణానికి చెందిన ఉమామహేశ్వర్ అలియాస్ జేకే మహేష్, నహీమ్ చిన్ననాటి నుంచి కలిసి చదువుకున్న ఆప్తమిత్రులని పేర్కొంటున్నారు.
అయితే సెటిల్మెంట్ల ద్వారా వచ్చిన డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య కొంతకాలంగా వివాదం కొనసాగినట్లు సమాచారం. ఈ వివాదమే హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నట్లు సమాచారం.
ఇద్దరిపైనా ఇప్పటికే పలు హత్య కేసులు ఉన్నాయని, ఇల్లెందు పోలీస్ స్టేషన్‌లో రౌడీషీట్లు ఉన్నాయని సమాచారం.
హత్యకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డైనట్లు, మరో వీడియో కూడా అందుబాటులో ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం అవుతున్నట్లు తెలుస్తోంది.
కాగా, నిందితుడు మహేష్‌తో పాటు అతని టీమ్ కోసం నాగోల్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, హత్యకు దారితీసిన కారణాలపై పోలీసుల దర్యాప్తులో మరింత స్పష్టత రావాల్సి ఉంది.
ఘటనకు సంబంధించిన CCTV వీడియో
గమనిక: వీడియోలో హింసాత్మక దృశ్యాలు ఉండే అవకాశం ఉన్నందున వీక్షకులు తగిన జాగ్రత్త వహించాలి.
ఫోన్ వీడియో రికార్డింగ్
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.