మానవత విలువలను పెంపొందించుకోవాలి: ఇంపాక్ట్ మోటివేషన్ స్పీకర్ పంజాల ఐలయ్య
గార్ల, తేది: 22-09-2026
గార్ల: ప్రతి ఒక్కరూ మానవత విలువలను పెంపొందించుకొని జీవించాలని ఇంపాక్ట్ మోటివేషనల్ స్పీకర్ పంజాల ఐలయ్య అన్నారు. మంగళవారం సాయంత్రం గార్ల కస్తూరిబా బాలికల విద్యాలయంలో ఆకాంక్ష ట్రస్ట్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు రున్‌వాల్ వీరన్న ఆధ్వర్యంలో నిర్వహించిన మానవత విలువలపై అవగాహన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.
మానవత విలువలు ఐదు రకాలని, అవి సత్యం, ధర్మం, ప్రేమ, దయ, అహింస అని ఆయన అవగాహన కల్పించారు. మానవత విలువలతో నిస్వార్థంగా జీవించినప్పుడే మానవుని జీవితానికి సార్థకత ఉంటుందని ఆయన అన్నారు. మానవత విలువలను పెంపొందించుకోవాలంటే శ్రద్ధగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన విద్యార్థులను కోరారు.
ఈ కార్యక్రమంలో ఆకాంక్ష ట్రస్ట్ జాతీయ అధ్యక్షులు వంగూరి వెంకటేశ్వరరావు, గిరిజన సమైక్య జిల్లా నాయకులు భూక్యా హరినాయక్, ట్రస్ట్ మెంబర్ పి. రామారావు, కస్తూరిబా స్కూల్ ఇన్‌చార్జి ఎస్‌ఓబీ విజయ తదితరులు పాల్గొన్నారు.
మా వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి – అప్‌డేట్ వార్తల కోసం
వాట్సాప్ ఛానెల్ జాయిన్133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.