సివిల్ వివాదాల్లో జోక్యం, అవినీతి ఆరోపణలపై శాఖాపరమైన విచారణ జరిగినట్లు సమాచారం

హైదరాబాద్: ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ సీఐ బాలస్వామిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకోవడం, అవినీతి ఆరోపణలు, విధి నిర్వహణలో నిర్లక్ష్యానికి సంబంధించి ఆయనపై ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది.
ఈ ఫిర్యాదుల నేపథ్యంలో మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి ఆదేశాలతో శాఖాపరమైన విచారణ జరిగినట్లు అంతర్గత వర్గాల సమాచారం. విచారణలో ఆరోపణలు నిర్ధారణ కావడంతో సీఐని సస్పెండ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే, సీఐ సస్పెన్షన్‌కు సంబంధించి పోలీసు శాఖ నుంచి అధికారిక ప్రకటన వెలువడినట్లు సమాచారం లేదు. అధికారిక ప్రకటన వెలువడితేనే సస్పెన్షన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు స్పష్టమవుతాయి.

పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

0 మంది ఇష్టపడ్డారు
షేర్
డౌన్‌లోడ్న్యూస్ పేపర్ క్లిప్పింగ్ • A4 • హై క్వాలిటీ
A4 కథనం
ఒరిజినల్ ఫోటో

మరిన్ని వార్తలు

Leave a Reply