మెట్రో-ఆర్టీసీ కామన్ పాస్ ఛార్జీలు ఫిక్స్.. నెలవారీ పాస్ రూ.8,500
హైదరాబాద్‌లో మెట్రో-ఆర్టీసీ ప్రయాణానికి కామన్ పాస్ ఛార్జీలను నిర్ణయించినట్లు సమాచారం. నెలవారీ, రోజువారీ కామన్ పాస్‌లతో పాటు సిటీ బస్సులకు వారం రోజుల పాస్ ఛార్జీలను కూడా నిర్ణయించినట్లు తెలుస్తోంది.
నెలవారీ కామన్ పాస్ రూ.8,500
మెట్రో-ఆర్టీసీ కామన్ పాస్ నెలవారీ ఛార్జీ మొత్తం రూ.8,500గా ఉండనుంది. ఇందులో మెట్రో ప్రయాణానికి రూ.7,000, ఆర్టీసీ ప్రయాణానికి రూ.1,500గా ఛార్జీలను నిర్ణయించినట్లు సమాచారం.
రోజువారీ పాస్ ఛార్జీ రూ.400
రోజువారీ కామన్ పాస్ ఛార్జీ రూ.400గా ఉండనుంది. ఇందులో మెట్రోకు రూ.300, ఆర్టీసీకి రూ.100గా నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఎక్కడ ప్రయాణించవచ్చు?
ఈ కామన్ పాస్ ద్వారా మెట్రో రైళ్లతో పాటు ఓఆర్ఆర్‌లోపల నడిచే అన్ని రకాల బస్సుల్లో ప్రయాణించేందుకు వీలుగా పాస్‌ను రూపొందించినట్లు సమాచారం.
సిటీ బస్సులకు వారం రోజుల పాస్
సిటీ బస్సుల్లో ప్రయాణించేందుకు వారం రోజుల పాస్ ఛార్జీ రూ.600గా నిర్ణయించినట్లు తెలుస్తోంది.
వార్తను షేర్ చేయండి
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.