ఇల్లందు నియోజకవర్గ సాగునీటి అంశాలపై మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డితో ఎమ్మెల్యే కనకయ్య చర్చలు
ఇల్లందు నియోజకవర్గానికి సంబంధించిన సాగునీటి అంశాలపై ఎమ్మెల్యే కోరం కనకయ్య రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డితో చర్చించారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న సందర్భంగా ఢిల్లీ విమానాశ్రయంలో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిని ఎమ్మెల్యే కలిశారు.
ఈ సందర్భంగా ఇల్లందు నియోజకవర్గంలోని సీతారామ ప్రాజెక్టుతో పాటు బయ్యారం పెద్ద చెరువుకు గోదావరి జలాలను తీసుకురావాలనే అంశాన్ని ఎమ్మెల్యే మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. బయ్యారం ప్రాంత రైతులు, ప్రజల దీర్ఘకాలిక సాగునీటి అవసరాలను కూడా ప్రస్తావించినట్లు తెలిపారు.
ఈ అంశాలపై మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే కనకయ్య పేర్కొన్నారు. “అతి త్వరలో మీకు, మీ నియోజకవర్గ ప్రజలకు గుడ్‌న్యూస్ చెబుతాను” అని మంత్రి హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
ఈ సమావేశంలో ఇల్లందు మార్కెట్ చైర్మన్ రాంబాబు, గంధంపల్లి కొత్తపేట సర్పంచ్ భూక్య ప్రవీణ్ నాయక్ కూడా ఉన్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.