నారాయణపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశం
యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లిమిటెడ్ ఆవరణలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశానికి మండల వ్యవసాయ అధికారి పూజా ముఖ్య అతిథిగా హాజరై రైతులను ఉద్దేశించి మాట్లాడారు.
సంఘం వార్షిక లావాదేవీలకు సంబంధించిన లాభనష్టాల ఖాతా, ఆస్తి-అప్పుల పట్టికలను సంఘం కార్యదర్శి బొడ్డుపల్లి శేఖర్ సభ్యులకు చదివి వినిపించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆడిట్ లెక్కల ప్రకారం సంఘం రూ.1.90 కోట్ల లాభంలో ఉన్నట్లు సమావేశంలో వెల్లడించారు.
సంఘంలో ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అందుబాటులో ఉన్నాయని, రైతులు వాటిని వినియోగించుకోవాలని సమావేశంలో సూచించారు. అలాగే సంఘం ద్వారా మీ-సేవ కేంద్రం నిర్వహిస్తున్నందున దానిని కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
రైతులు సంఘం నుంచి తీసుకున్న రుణాలకు సంబంధించిన వడ్డీలను ఎప్పటికప్పుడు చెల్లిస్తే సంఘం మరింత అభివృద్ధి చెందుతుందని సమావేశంలో సూచించారు.
ఎల్‌నినో ప్రభావం ఉన్నందున రైతులు ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచించినట్లు సమాచారం. సంఘాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు రైతులు పలు సూచనలు చేసినట్లు తెలిపారు.
సమావేశంలో సంఘం పాలకవర్గ సభ్యులు బొడ్డుపల్లి గాలయ్య, చెరుకుపల్లి నరసింహ, నీళ్ల జంగయ్య, బానోతు కిషన్, గడ్డం పాపమ్మ, గడ్డం పెంటయ్య, మహ్మదాబాద్ సర్పంచ్ ముత్యాల అంజయ్యతో పాటు సభ్యులు ఏపూరి సత్తయ్య, బెల్లంకొండ శంకరయ్య, మందుల బాలకృష్ణ, చిలువేరు బిక్షం, గడ్డం యాదగిరి, నాతి లక్ష్మణ్, కరెంటు శ్రీను, సంఘ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.