రోడ్డు భద్రతపై అవగాహన.. యువతకు 200 హెల్మెట్లు పంపిణీ
IIFL హోమ్ లోన్స్, JKS స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కార్యక్రమం
ఇవి కూడా చదవండి
పవార్ వార్త, జవహర్‌నగర్: రోడ్డు ప్రమాదాల నివారణ, యువతలో రహదారి భద్రతపై అవగాహన కల్పించే లక్ష్యంతో జవహర్‌నగర్‌లో 200 మంది యువతకు హెల్మెట్లు పంపిణీ చేశారు. శనివారం జవహర్‌నగర్ ప్రభుత్వ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో IIFL హోమ్ లోన్స్ సంస్థ, JKS స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో “సురక్షితమైన రహదారులు.. సురక్షితమైన జీవితాలు” అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
జవహర్‌నగర్ ప్రాంతానికి చెందిన కమ్యూనిటీల యువతకు కార్యక్రమంలో భాగంగా 200 హెల్మెట్లను అందజేశారు. నిత్యం చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు ధరించడం ద్వారా తలకు కలిగే గాయాల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని అవగాహన కల్పించడమే కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.
యువత రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ తమ జీవితాల్లో ఉన్నత స్థాయికి ఎదగాలని, ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఈ కార్యక్రమం ద్వారా సందేశం ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో IIFL ప్రతినిధులు జగదీష్, రేణుక, JKS స్వచ్ఛంద సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, మండల విద్యాధికారి అజీమ్ ఉద్దీన్ పాల్గొన్నారు.
















