జయప్రద కాలనీలో ఘనంగా వీధి సూచిక బోర్డుల ప్రారంభోత్సవం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా చెంగిచెర్ల డివిజన్ పరిధిలోని జయప్రద కాలనీలో నూతన కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వీధి నెంబర్ల సూచిక బోర్డులను శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జయప్రద కాలనీ గౌరవ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్ బింగి జంగయ్య యాదవ్, అరవింద కాలనీ అధ్యక్షులు చిన్న ముదిరాజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

కాలనీ నూతన కమిటీ అధ్యక్షురాలు చింతపంటి కవితతో కలిసి బింగి జంగయ్య యాదవ్ రిబ్బన్ కట్ చేసి వీధి సూచిక బోర్డులను అధికారికంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ బింగి జంగయ్య యాదవ్ మాట్లాడుతూ.. కాలనీ అభివృద్ధి కోసం నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు చొరవ తీసుకుని, స్వల్ప కాలంలోనే ప్రజలకు ఉపయోగపడేలా వీధి సూచిక బోర్డులను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు.

కాలనీలోకి కొత్తగా వచ్చేవారికి, కొరియర్ మరియు అత్యవసర సేవల సిబ్బందికి వీధి నంబర్లు లేక ఇబ్బందులు ఎదురవుతున్న తరుణంలో ఈ సూచిక బోర్డులు ఎంతో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.

కాలనీ నూతన అధ్యక్షురాలు చింతపంటి కవిత మాట్లాడుతూ.. తమ కాలనీని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దడమే నూతన కమిటీ లక్ష్యమని తెలిపారు. స్థానిక సమస్యల పరిష్కారానికి, కాలనీ సంక్షేమానికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

భవిష్యత్తులో కూడా కాలనీ వాసుల సహకారంతో మౌలిక వసతుల కల్పనకు శ్రమిస్తామని చింతపంటి కవిత తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాలనీ కమిటీ ప్రధాన కార్యదర్శి చీరల నీలమ్మ, ఉపాధ్యక్షులు జీ. హరి నాయక్, కోశాధికారి ఓక్ ఓబులేసు, జాయింట్ సెక్రటరీ పి. పౌలు, ఇతర కార్యవర్గ సభ్యులు, సీనియర్ నాయకులు, మహిళలు, పెద్ద సంఖ్యలో కాలనీవాసులు పాల్గొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి

🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply