చిన్న క్రాంతి కాలనీలో వైభవంగా శ్రీ లక్ష్మీ గణపతి కుంకుమార్చన

మేడ్చల్ జిల్లా చెంగిచెర్ల డివిజన్ పరిధిలోని చిన్న క్రాంతి కాలనీలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా చిన్న క్రాంతి కాలనీ హౌస్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద మహిళలు శ్రీ లక్ష్మీ గణపతి కుంకుమార్చన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

ఈ సందర్భంగా స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. లంబోదరునికి ప్రత్యేక అలంకరణలు చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. సమాజంలో అందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, కాలనీలోని ఇళ్లలో సుఖశాంతులు విలసిల్లాలని కోరుకుంటూ మహాగణపతికి కుంకుమార్చన పూజలు నిర్వహించారు.

అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.

మహిళల పెద్ద సంఖ్యలో పాల్గొనడం

ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో కాలనీ మహిళలు గొరిగే రాధిక, నిలుగొండ వరలక్ష్మి, ఉష, శారద, సారిక, నవ్య, మాధవి, శ్రీలత, కావ్య, స్వాతి, రేణుక, అనిత, మంజుల, సరిత, రజిత తదితరులు పాల్గొన్నారు.

అసోసియేషన్ ప్రతినిధుల హాజరు

చిన్న క్రాంతి కాలనీ హౌస్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మేడ బాపిరాజు, ప్రధాన కార్యదర్శి రాజేందర్ రెడ్డి, కోశాధికారి శివ పటేల్, గౌరవ అధ్యక్షులు గొరిగే నర్సింహా కురుమ, వర్కింగ్ ప్రెసిడెంట్ నిలుగొండ వెంకటేష్ గౌడ్‌తో పాటు కాలనీ ప్రజలు కార్యక్రమానికి హాజరయ్యారు.

కాలనీ ప్రజలు, మహిళలు పాల్గొనడంతో గణేష్ మండపం ప్రాంగణంలో సందడి నెలకొంది.

ఈ వార్తను షేర్ చేయండి
WhatsApp Facebook X Telegram

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply