సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. మంటల్లో వోల్వో కారు దగ్ధం
సూర్యాపేట మండలం పిల్లలమర్రి ఫ్లైఓవర్ సమీపంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఖమ్మం–హైదరాబాద్ 365బీ జాతీయ రహదారిపై వెళ్తున్న వోల్వో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైంది.
ఉదయం సుమారు 7.15 గంటల సమయంలో ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. కారులో ఉన్న వ్యక్తి మంటల్లో చిక్కుకుని మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలంలో మృతదేహానికి సంబంధించిన ఆనవాళ్లు లభించినట్లు సమాచారం.
ప్రమాదంలో కారు నంబర్ ప్లేట్ కూడా పూర్తిగా కాలిపోవడంతో వాహనం, మృతుడి వివరాలను గుర్తించడం పోలీసులకు కష్టంగా మారింది. సూర్యాపేట రూరల్ ఎస్‌ఐ ఎం. అనిల్ కుమార్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.
వాహనం ఏ ప్రాంతం నుంచి వచ్చిందనే విషయాన్ని గుర్తించేందుకు సమీపంలోని టోల్ ప్లాజాల సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై కూడా దర్యాప్తు కొనసాగుతున్నట్లు సమాచారం.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.