జుక్కల్, అక్టోబర్ 7, 2026 (పవార్ వార్త): జుక్కల్ నియోజకవర్గంలోని చిన్న కొడప్‌గల్, బిచ్కుంద టౌన్, షెట్లూర్, ఖాత్గావ్, కుర్లా, ఎంబుర, ఏలేగావ్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం గ్రేడ్-ఏ రకం ధాన్యానికి క్వింటాలుకు ₹2,461 కనీస మద్దతు ధర (MSP) లభిస్తుందని తెలిపారు.
అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్దేశిత సన్నరకం ధాన్యానికి క్వింటాలుకు అదనంగా ₹500 బోనస్ అందుతుందని రైతులకు వివరించారు.
రైతులు దళారులను ఆశ్రయించి నష్టపోకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు ధాన్యాన్ని విక్రయించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Sai Tarun yaswanth
Sai Tarun yaswanth పవార్ వార్త • సైట్ అడ్మిన్ ఈ రచయిత ప్రచురించిన ఇతర వార్తలను చూడండి.

Leave a Reply