కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై పద్మాదేవేందర్ రెడ్డి ఫైర్
తాజా రాజకీయ వార్తలు
🔥 రాజకీయ వార్తలు

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను రద్దుచేస్తే… తెలంగాణ అగ్నిగుండంగా మారుతుంది!

కాంగ్రెస్ ప్రభుత్వం అవగాహన లేకుండా ప్రజలతో చెలగాటమాడుతోందని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి విమర్శించారు.

📍 మెదక్ 🏛️ బిఆర్ఎస్ పార్టీ 🎙️ పద్మాదేవేందర్ రెడ్డి 📢 ధర్నా కార్యక్రమం
🎥 కార్యక్రమం పూర్తి వీడియో
⚡
పద్మాదేవేందర్ రెడ్డి హెచ్చరిక: కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను రద్దు చేయాలని చూస్తే తెలంగాణ రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని ఆమె హెచ్చరించారు.

ప్రధాన వార్త

పేదింటి ఆడబిడ్డల తల్లిదండ్రుల కష్టాలను ప్రత్యక్షంగా చూసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను ప్రవేశపెట్టి ఎంతో మంది కుటుంబాలకు అండగా నిలిచారని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు.

పేదల సంక్షేమానికి ఉపయోగపడుతున్న ఈ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసే ప్రయత్నాలు చేస్తోందని ఆమె ఆరోపించారు.

సోమవారం స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద భారీ ఎత్తున మెదక్ నియోజక వర్గ బిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో రాస్తారోకో, ధర్నా కార్యక్రమం చేపట్టారు.

“

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ వంటి పథకాలు పేద కుటుంబాలకు ఎంతో భరోసానిస్తున్నాయి. వాటిని రద్దు చేయాలని చూస్తే తెలంగాణ రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుంది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సరైన అవగాహన లేకుండా ప్రజలతో చెలగాటమాడుతోందని పద్మాదేవేందర్ రెడ్డి మండిపడ్డారు.

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల అమలుపై స్పష్టత ఇవ్వకుండా కాలయాపన చేయడం సరికాదన్నారు.

ఈ పథకాలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ హైకోర్టులో కేసు వేస్తే, ప్రభుత్వం తడిబట్ట వేసుకుని కూర్చున్నట్లుగా వ్యవహరిస్తూ సమస్యను పరిష్కరించకుండా జాప్యం చేస్తోందని ఆమె విమర్శించారు.

అదేవిధంగా రైతులకు యూరియా అందించడంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆమె ఆరోపించారు.

యాప్‌ల పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేయడం మానుకుని, వారికి అవసరమైన ఎరువులను సకాలంలో అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.

ముఖ్యాంశాలు

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసే ప్రయత్నం చేస్తోందని పద్మాదేవేందర్ రెడ్డి ఆరోపించారు.
పేద కుటుంబాలకు ఈ పథకాలు ఎంతో భరోసానిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు.
పథకాలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ హైకోర్టులో కేసు వేసిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు.
సమస్యను పరిష్కరించకుండా ప్రభుత్వం జాప్యం చేస్తోందని విమర్శించారు.
యాప్‌ల పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా యూరియాను సకాలంలో అందించాలని డిమాండ్ చేశారు.
సంక్షేమ పథకాలను రద్దు చేస్తే తెలంగాణ అగ్నిగుండంగా మారుతుందని హెచ్చరించారు.

🔥 తీవ్ర హెచ్చరిక

పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాలను స్పష్టం చేయాలని, సంక్షేమ పథకాలను యథావిధిగా కొనసాగించాలని పద్మాదేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ళ శశిధర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మెన్ ఆరేళ్ళ మల్లిఖార్జున్ గౌడ్, రామాయంపేట మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్ గంగా నరేందర్, మెదక్ పట్టణ బిఆర్ఎస్ పార్టీ కన్వీనర్ గడ్డమీది క్రిష్ణా గౌడ్, న్యాయవాది జీవన్ రావు తదితరులు పాల్గొన్నారు.

మెదక్ పట్టణ బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు మామిండ్ల ఆంజనేయులు, మ్యాదరి దీపక్ కుమార్, సాయి, జుబేర్ అహ్మద్, మాయా గంగమణి మల్లేశం, రామాయంపేట బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ చరితతో పాటు మెదక్, రామాయంపేట, హవేలి ఘన్పూర్, పాపన్నపేట, నిజాంపేట, శంకరంపేట మండలాల బిఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, సోములు, విష్ణువర్ధన్ రెడ్డి, రంగారావుతో పాటు నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

ప్రభుత్వానికి డిమాండ్

పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాలను స్పష్టం చేయాలని, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలని పద్మాదేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు.

🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply