హైదరాబాద్: బి.ఎడ్ ఉపాధ్యాయ విద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న ఉపాధ్యాయ విద్యావేత్తలను సన్మానించే “గురు వందనం – రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ విద్యావేత్తల పురస్కారాలు–2026” కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని రవీంద్రభారతి ఆడిటోరియంలో నిర్వహించారు.
కామారెడ్డి రక్తదాతల సమూహ గౌరవ అధ్యక్షులు, ఎస్.వి. టీచర్ ప్లస్ ఈ-లెర్నింగ్ అకాడమీ ఫౌండర్ డాక్టర్ వేద ప్రకాష్ ఆధ్వర్యంలో, ప్రిన్సిపల్స్ అసోసియేషన్ ఆఫ్ కాలేజెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ (PACE) ఇండియా, తెలంగాణతో పాటు తెలంగాణ బి.ఎడ్ లెక్చరర్స్ అసోసియేషన్, తెలంగాణ ప్రైవేట్ బి.ఎడ్ కాలేజ్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్, నిర్వాహక కమిటీ సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలలో పనిచేస్తున్న 31 మంది అధ్యాపకులను సన్మానించారు. బి.ఎడ్ ఉపాధ్యాయ విద్య రంగంలో సేవలు అందిస్తూ, విద్యా ప్రమాణాల అభివృద్ధి, భవిష్యత్ ఉపాధ్యాయుల రూపకల్పన, ఉపాధ్యాయ విద్యా వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తున్న వారిని గుర్తించి గౌరవించేందుకు కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు డాక్టర్ పిల్లమారి వేదప్రకాష్ తెలిపారు.
కార్యక్రమానికి ప్రొఫెసర్ వి. సుధాకర్, చైర్ ప్రొఫెసర్, చాణక్య యూనివర్సిటీ, బెంగళూరు; హానరరీ ప్రొఫెసర్, IEDS, న్యూఢిల్లీ (NCR), నోయిడా; NCTE, ICPR సభ్యులు; డాక్టర్ పి. శంకర్, అసోసియేట్ ప్రొఫెసర్, NIEPA, న్యూఢిల్లీ; డిప్యూటీ డైరెక్టర్, UGC-MMTTC; SRC-NCTE సభ్యులు; ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్, డైరెక్టర్, డైరెక్టరేట్ ఆఫ్ అకడమిక్ ఆడిట్, తెలంగాణ యూనివర్సిటీ; డాక్టర్ లలిత, డాక్టర్ సునీత తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఉపాధ్యాయ విద్య రంగంలో అంకితభావం, విద్యా నాయకత్వం, నూతన ఆవిష్కరణలు, వృత్తిపరమైన నైపుణ్యం, విశిష్ట సేవలను గుర్తించి “గురు వందనం” కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన డాక్టర్ వేద ప్రకాష్‌ను అభినందించి సన్మానించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని బి.ఎడ్ కళాశాలల ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయ విద్యావేత్తలు, బి.ఎడ్ లెక్చరర్లు, విద్యావేత్తలు, విద్యా పరిపాలకులు, ఉపాధ్యాయ విద్యా రంగానికి చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.