కామారెడ్డిలో మెగా రక్తదాన శిబిరం.. 96 యూనిట్ల రక్తం సేకరణ

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కర్షక్ బి.ఎడ్ కళాశాలలో కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్) సంయుక్త ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం, ట్రాఫిక్ అవగాహన సదస్సు నిర్వహించారు. భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ 76వ జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.

కామారెడ్డిలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో పాల్గొన్న రక్తదాతలు కామారెడ్డి మెగా రక్తదాన శిబిరంలో రక్తదాతలకు హెల్మెట్లు అందజేస్తున్న కార్యక్రమ దృశ్యం

ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి

కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీఎస్పీ మధుసూదన్, సీఐ నరహరి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రక్తదాతలకు హెల్మెట్లు అందజేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని సూచించారు.

రక్తదాతలు ప్రాణదాతలేనని, సకాలంలో రక్తం అందకపోతే ఎంతోమంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంటుందని వారు పేర్కొన్నారు. 19 సంవత్సరాలుగా రక్తదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్న కామారెడ్డి రక్తదాతల సమూహ సభ్యులను వారు అభినందించారు.

19 ఏళ్లుగా రక్తదాన కార్యక్రమాలు

ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, కామారెడ్డి రక్తదాతల సమూహ ఫౌండర్ డాక్టర్ బాలు మాట్లాడుతూ 2007లో 35 మందితో రక్తదాతల సమూహాన్ని ప్రారంభించామని తెలిపారు. ప్రస్తుతం 3,500 మందికి పైగా రక్తదాతలతో రాష్ట్రంలోనే అతిపెద్ద రక్తదాతల సేవా సమూహంగా ఆవిర్భవించిందని ఆయన పేర్కొన్నారు.

19 సంవత్సరాల కాలంలో 30 వేల యూనిట్ల రక్తాన్ని సేకరించామని, నాలుగు సంవత్సరాల కాలవ్యవధిలో తలసేమియా బాధిత చిన్నారులకు 4 యూనిట్ల రక్తాన్ని సేకరించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డును అందుకున్న ఏకైక సంస్థగా దేశంలో నిలిచామని డాక్టర్ బాలు తెలిపారు.

రక్తదాతలకు హెల్మెట్లు, ప్రశంస పత్రాలు

యువతకు రక్తదానం పట్ల అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని డాక్టర్ బాలు తెలిపారు. రక్తదానం చేసిన రక్తదాతలకు హెల్మెట్లు అందజేస్తున్నామని, ఇప్పటివరకు దాతల సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా 4,000 హెల్మెట్లను అందజేశామని పేర్కొన్నారు.

ప్రతి సంవత్సరం మూడు సార్లు రక్తదానం చేసే రక్తదాతలకు అవార్డులు అందజేస్తున్నామని, రక్తదాతలు చేస్తున్న సేవలు వెలకట్టలేనివని డాక్టర్ బాలు అన్నారు.

96 మంది రక్తదానం

మెగా రక్తదాన శిబిరంలో 96 మంది రక్తదాతలు రక్తదానం చేశారు. రక్తదానం చేసిన దాతలకు ప్రశంస పత్రాలు, హెల్మెట్లను అందజేసి అభినందించారు.

పాల్గొన్న వారు

ఈ కార్యక్రమంలో కామారెడ్డి రక్తదాతల సమూహ సభ్యులు డాక్టర్ బాలు, డాక్టర్ వేద ప్రకాష్, జమీల్ అహ్మద్, పర్ష వెంకటరమణ, ఎర్రం చంద్రశేఖర్, జలిగామ శ్రీకాంత్, కర్షక్ బి.ఎడ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ యస్.కె. రషీద్, ఆర్కే విద్యా సంస్థల సీఈవో జైపాల్ రెడ్డి, తెలంగాణ ఫార్మ కౌన్సిల్ సభ్యులు చిలువేరి మారుతి, దొంతి సుధాకర్, రంగ కిషన్, రక్తదాతలు పాల్గొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply