హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నిర్వహించిన విశ్వకర్మ జయంతి కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రక్షణ సేన పార్టీని ప్రజలు ఆదరిస్తే అధికారంలోకి వచ్చిన వెంటనే విశ్వకర్మల జీవితాల్లో మార్పులు తీసుకొచ్చే నిర్ణయాలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు.
పుస్తెలు, మెట్టెలను స్వర్ణకారులు మాత్రమే తయారు చేసి విక్రయించేలా చర్యలు తీసుకునే ఫైల్‌పై తాను మొదటి సంతకం చేస్తానని కల్వకుంట్ల కవిత తెలిపారు. విశ్వకర్మల్లోని ఐదు దాయిలైన మను, మయ, త్వష్ట, విశ్వజ్ఞ, శిల్పిల పరిస్థితుల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు.

విశ్వకర్మ వృత్తుల్లో ఉన్న కష్టాలను దగ్గరుండి చూశానని, ఈ అంశాలపై ఎన్నోసార్లు చట్టసభల్లో మాట్లాడానని ఆమె గుర్తు చేశారు. కమర్షియల్ గోల్డ్ షాపులు వచ్చిన తర్వాత స్వర్ణకారుల జీవితాలు ఇబ్బందుల్లో పడ్డాయని, సైనైడ్ తిని ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు.
వడ్రంగులకు ఇన్సూరెన్స్ కల్పించాల్సిన అవసరం ఉందని, శిల్పులకు దేవాలయాల కమిటీల్లో స్థానం కల్పించాలని కల్వకుంట్ల కవిత అన్నారు. విశ్వకర్మలకు భూములు ఉండవని పేర్కొంటూ, భూములు లేని వర్గాలకు భూమి పంపిణీ చేయాలనే ఉద్దేశంతో భూలక్ష్మీ పథకాన్ని రూపొందించామని తెలిపారు.
భూలక్ష్మీ పథకానికి మారోజు వీరన్న, ప్రొఫెసర్ జయశంకర్, శ్రీకాంతాచారి స్ఫూర్తి అని ఆమె పేర్కొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తనకు తండ్రి తర్వాత తండ్రి లాంటి వారని, ఆయన ఫొటో లేకుండా తమ పార్టీ కార్యక్రమం ఏదీ జరగదని చెప్పారు.
విశ్వకర్మల కష్టం తెలిసిన బిడ్డనని పేర్కొన్న కల్వకుంట్ల కవిత, తమ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా 40 ఏళ్లుగా విశ్వకర్మ జయంతిని కుల పెద్దలు ఘనంగా నిర్వహిస్తుండటం గొప్ప విషయమన్నారు.
విశ్వకర్మ జయంతి కార్యక్రమంలో పాల్గొనడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.