కామారెడ్డి 7వ తరగతి బాలుడి తబలా టాలెంట్: వందల ప్రోగ్రాముల్లో అదరగొడుతున్న పరమేశ్వర్
కామారెడ్డి జిల్లా
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప నగర్ కాలనీలో నివాసం ఉండే పరమేశ్వర్ అనే బాలుడు తన తబలా నైపుణ్యంతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఏడో తరగతి చదువుతున్న ఈ బాలుడు చిన్న వయసులోనే తబలా వాయించడం ప్రారంభించి, ప్రస్తుతం వందలకు పైగా ప్రోగ్రాములు చేసి ప్రశంసలు అందుకుంటున్నాడు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప నగర్ కాలనీలో నివాసం ఉండే సాయిరాం – స్వప్న దంపతులకు విగ్నేశ్వర్ పెద్ద కుమారుడు కాగా, పరమేశ్వర్ చిన్న కుమారుడు. సాయిరాం ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. పెద్ద కుమారుడు విగ్నేశ్వర్ ప్రస్తుతం పాలిటెక్నిక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. పరమేశ్వర్ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సరస్వతి శిశుమందిర్‌లో ఏడో తరగతి చదువుతున్నాడు.
పరమేశ్వర్‌కు నాలుగో తరగతి నుంచి ఖాళీ సమయంలో ఏ వస్తువులు కనిపించినా వాటిపై తబలాగా వాయించేవాడు. దీన్ని చూసిన తండ్రి మొదట్లో బెదిరించాడు. తర్వాత పరమేశ్వర్ అలాగే చేయడంతో ఒక తబలా సెట్ తీసుకువచ్చి ఇవ్వడంతో అప్పటినుంచి యూట్యూబ్‌లో తబలా క్లాసులు చూస్తూ తబలా నేర్చుకున్నాడు.
ప్రస్తుతం ఏడో తరగతి చదువుతున్న పరమేశ్వర్ తన తబలా నైపుణ్యంతో వందలాది ప్రోగ్రాములలో తబలా వాయించాడు. తిరుపతి, మహారాష్ట్ర, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో పరమేశ్వర్ తబలా ప్రోగ్రామ్ ఇచ్చాడు. అంతేకాకుండా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప భజన మండలిలో తబలా వాయిస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నాడు. ఇంత చిన్న వయసులోనే తబలాను వివిధ రకాలుగా వాయించడంతో అందరూ ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. ఇలాంటి బాలుడిని ప్రోత్సహించాల్సిన అవసరం అందరికీ ఉందని పలువురు పేర్కొంటున్నారు. ప్రభుత్వం ద్వారా ఇలాంటి బాలుడిని ప్రోత్సహించి మరింత ప్రతిభ కనబరిచే విధంగా చూడాలని కోరుతున్నారు.
పరమేశ్వర్ తబలా ప్రదర్శన వీడియోలు చూడండి
మా వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి – అప్‌డేట్ వార్తల కోసం
వాట్సాప్ ఛానెల్ జాయిన్133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.