కొత్త పెన్షన్ల పేరిట అధికారుల వసూళ్లు: దరఖాస్తుదారుల నుంచి రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు
రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త పెన్షన్ అందించేందుకు ప్రభుత్వం క్షేత్రస్థాయిలో విచారణ బాధ్యతలను అధికారులకు అప్పగించింది. కొత్త పెన్షన్ కోసం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5.98 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అయితే ఈ ప్రక్రియలో కొందరు అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నట్లు సమాచారం.
రకరకాల కారణాలు చెప్పి పెన్షన్ రాదని బయటపెట్టి, దరఖాస్తుదారుల నుంచి రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. స్థానిక కాంగ్రెస్ నాయకులతో కుమ్మక్కై అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నట్లు సమాచారం.
స్థానిక కాంగ్రెస్ నాయకులు చెప్పిన వారికి ఎలాంటి కండీషన్లు లేకుండా పెన్షన్లు మంజూరు చేస్తూ, నాయకులు ఇబ్బంది పెట్టమని చెప్పిన వారికి మాత్రం అనేక కండీషన్లు పెడుతూ వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఇతర ప్రభుత్వ పథకాలు పొందితే పెన్షన్ రాదని, కొడుకులు ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నా పెన్షన్ రాదని చెప్పి భయపెట్టి ఒక్కో దరఖాస్తుదారుడి నుంచి రూ.5 వేల నుంచి రూ.10 వేలు వసూలు చేస్తున్నట్లు సమాచారం.
వరంగల్ జిల్లాలోని ఓ మున్సిపాలిటీలో కాంగ్రెస్ కౌన్సిలర్ అధికారులతో కలిసి దరఖాస్తుదారుల వద్ద డబ్బులు వసూలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో కొత్త పెన్షన్ రావాలంటే ఇన్‌కమ్ సర్టిఫికెట్ తప్పనిసరి అని నిబంధన పెట్టడంతో, సర్టిఫికెట్ మంజూరు చేయడానికి రెవెన్యూ కార్యాలయాల్లో సైతం దరఖాస్తుదారుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం.
కాగా, కొత్త పెన్షన్లను దసరా నాటికి పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో ఆలస్యం అవుతున్న నేపథ్యంలో మంత్రి మంగళవారం సమీక్ష నిర్వహించారు.
మా వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి – అప్‌డేట్ వార్తల కోసం
వాట్సాప్ ఛానెల్ జాయిన్133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.