కామారెడ్డిలో 275 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం.. రైస్ మిల్లుపై తనిఖీలు
కామారెడ్డి జిల్లాలో పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారన్న అనుమానంతో అధికారులు తనిఖీలు నిర్వహించారు. రామారెడ్డి మండలం రెడ్డిపేటలోని శ్రీ భాగ్యలక్ష్మి ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్‌పై ఎన్ఫోర్స్‌మెంట్ టాస్క్‌ఫోర్స్, సివిల్ సప్లై అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్నట్లు అనుమానిస్తున్న సుమారు 275 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యంతో కూడిన లారీని అధికారులు గుర్తించారు. దీంతో లారీని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
బియ్యం ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై విచారణ
పట్టుబడిన పీడీఎస్ బియ్యం ఎక్కడి నుంచి వచ్చింది.. ఎక్కడికి తరలిస్తున్నారనే అంశాలపై అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.
ఎన్ఫోర్స్‌మెంట్ డీఎస్పీ శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. గతంలోనూ ఈ రైస్ మిల్‌పై కేసులు ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం పట్టుబడిన పీడీఎస్ బియ్యానికి సంబంధించిన పూర్తి వివరాలపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు.
పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని డీఎస్పీ శేఖర్‌రెడ్డి స్పష్టం చేశారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.