మౌంట్ తరంగ్–II అధిరోహణ యాత్రలో కామారెడ్డి గిరిజన కళాశాల విద్యార్థి బన్నీ
హిమాచల్‌ప్రదేశ్‌లోని మియార్ లోయలో ఉన్న మౌంట్ తరంగ్–II పర్వతాన్ని అధిరోహించిన పది మంది సభ్యుల భారతీయ బృందంలో కామారెడ్డి గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాల విద్యార్థి విస్లావత్ బన్నీ పాల్గొన్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ. శ్రీనివాస స్వామి తెలిపారు.
ట్రాన్స్‌సెండ్ అడ్వెంచర్స్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ యాత్రలో బృందం 6,027 మీటర్ల ఎత్తున్న శిఖరాన్ని అధిరోహించినట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా బన్నీ పర్వతంపై భారత జాతీయ పతాకంతో పాటు తెలంగాణ గిరిజన సంక్షేమ విద్యా సంస్థకు సంబంధించిన ఫ్లెక్సీని ప్రదర్శించినట్లు పేర్కొన్నారు.
ఎల్లాపూర్ తండా నుంచి పర్వతారోహణ వరకు
కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఎల్లాపూర్ తండాకు చెందిన బన్నీ వ్యవసాయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చారు. గతంలో కిలిమంజారో, కాంగ్ యత్సే, లద్దాఖ్‌లోని మరో పర్వతాన్ని అధిరోహించినట్లు కళాశాల అందించిన సమాచారంలో పేర్కొన్నారు.
బన్నీ పర్వతారోహణ విజయంపై ఆయన తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేసినట్లు తెలిపారు.
బన్నీకి గురుకుల సొసైటీ అధికారుల అభినందనలు
తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి కె. సీతాలక్ష్మి బన్నీని అభినందించారు. ఆయన సాధన సంస్థకు, కళాశాలకు గర్వకారణమని పేర్కొంటూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించినట్లు కళాశాల వర్గాలు తెలిపాయి.
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ. శ్రీనివాస స్వామి, అధ్యాపకులు, సిబ్బంది బన్నీని అభినందించారు. ఆయనను ప్రోత్సహించిన ఫిజికల్ డైరెక్టర్ అనిల్ కుమార్‌ను కూడా ప్రిన్సిపాల్ ప్రత్యేకంగా అభినందించారు.
ఈ వార్తను షేర్ చేయండి
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.